: ఈ నెల 30లోగా రైతు రుణమాఫీపై స్పష్టత: మంత్రి ప్రత్తిపాటి


రైతు రుణమాఫీపై ఈ నెల 30లోగా స్పష్టత ఇస్తామని ఏపీ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆర్ బీఐని, కేంద్రాన్ని ఎలాగైనా ఒప్పించి రుణమాఫీ చేసి తీరుతామన్నారు. దీనిపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వివరించారు. రుణమాఫీ విధివిధానాలపై ఈ నెల 22లోగా కమిటీ నివేదిక వస్తుందని, రుణమాఫీపై బ్యాంకర్లతో మాట్లాడాకే బాధ్యతలు కమిటీకి అప్పగించామని మంత్రి పేర్కొన్నారు. పారిశ్రామిక వేత్తలకు వన్ టైమ్ సెటిల్ మెంట్లకు ఒప్పుకున్న బ్యాంకులు ఇప్పుడెందుకు ఒప్పుకోవని ప్రశ్నించారు. ఈ మేరకు బ్యాంకర్లతో చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బ్యాంకు అధికారులతో రేపు మరోసారి సమావేశం అవుతామని చెప్పారు. రైతులకు నోటీసులు ఇచ్చిన చోట చర్యలు తీసుకోవద్దని చెప్పామన్నారు.

  • Loading...

More Telugu News