: బజారుకని బయటకు వెళ్లిన భార్యాభర్తలు శవాలై కన్పించారు


అరాచక ఉత్తరప్రదేశ్ లో హత్యలు, అఘాయిత్యాలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఖైరాబాద్ ప్రాంతంలోని ముసేరీపూర్ గ్రామంలో సోమవారం నాడు భార్యాభర్తలు బజారుకెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి బయల్దేరారు. ఇవాళ తెల్లవారేసరికి ఆ దంపతులు శంభు (40), కమల (35) శవాలు ఊరి బయట చెట్టుకు వేలాడుతూ కన్పించాయి. వారిద్దరినీ ఎవరో హత్య చేసి చెట్టుకు వేలాడదీశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News