: అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు : మంత్రి దానం
మంత్రి దానం నాగేందర్ తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. అధికార దుర్వినియోగానికి తాను పాల్పడలేదన్నారు. ఏ అధికారిని అయినా తాను దూషించినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని తెలిపారు. టీడీపీ ఏజెంట్లైన కొందరు పోలీసులు తనపై అకారణంగా కేసు పెట్టారని చెప్పారు. తన విషయంలో వాస్తవాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు వెల్లడించారు. కాగా, సీబీఐ చార్జ్ షీటులో ఏముందో తెలియకుండా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామాపై స్పందించనని దానం పేర్కొన్నారు.