: ప్రీతి జింటా కేసులో క్రికెటర్ కుమారుడిని విచారించనున్న పోలీసులు


మాజీ ప్రియుడు నెస్ వాడియాపై ప్రీతి జింటా పెట్టిన కేసులో ఓ మాజీ క్రికెటర్ కుమారుడిని పోలీసులు విచారించనున్నారు. మే 30న వాంఖడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వాడియా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించడంతో పాటు బెదిరించాడని ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్ జరిగిన రోజు స్టేడియంలోని గ్యాలరీలో వాడియా, ప్రీతీజింటాలు కూర్చున్న దగ్గరే మాజీ క్రికెటర్ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని విచారించాలని నిర్ణయించారు. ఇక, ఈ కేసులో వ్యక్తిగతంగా తమ ముందు హాజరై స్టేట్ మెంట్ ఇవ్వాలని ప్రీతిని పోలీసులు కోరారు. మరోవైపు ఈ కేసులో రాజీకి అవకాశం లేదని ఆమె తరపు న్యాయవాది హితేష్ జైన్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News