: భారతీయ నర్సులు క్షేమం


సమస్యాత్మకంగా మారిన ఇరాక్ లోని తిక్రిత్ పట్టణంలో భారతీయ నర్సులు చిక్కుకున్నారు. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఇక్కడ పెద్ద ఎత్తున హింస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయ నర్సులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు అంతర్జాతీయ సంస్థ రెడ్ క్రిసెంట్ తిక్రిత్ లో చిక్కుకున్న 46 మంది భారతీయ నర్సులతో మాట్లాడి, క్షేమంగా ఉన్నట్లు తెలుసుకుంది. హింసాత్మక ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రత కోసం అక్కడి భారత రాయబారి ఇరాకీ అధికారులు, ఐక్యరాజ్యసమితి సహాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నర్సులను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించే ప్రతిపాదన ఉన్నా, తిక్రిత్ కు దారితీసే రోడ్లు సరిగ్గా లేవని సమాచారం.

  • Loading...

More Telugu News