: టీటీడీ చైర్మన్ పదవికి పోటీ పడుతున్న 'ఆ నలుగురు'
తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ పదవికి నలుగురు టీడీపీ సీనియర్లు పోటీపడుతున్నారు. వీరిలో నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఉన్నారు. వీరిలో రాయపాటి, జేసీలకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామని గతంలో హామీ ఇచ్చినట్టు సమాచారం. చదలవాడ విషయానికొస్తే... ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రిని చేయడంగాని లేదా టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం కానీ చేయాలని ఆయన ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి చేసిన సేవలకు గాను టీటీడీ చైర్మన్ పదవిని తనకే కట్టబెట్టాలని గాలి కోరుతున్నారు. మరి, వీరిలో ఈ పదవిని ఏపీ సీఎం చంద్రబాబు ఎవరికి కట్టబెడతారో వేచి చూడాలి!