: హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్న తెలంగాణ డీజీపీ
తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నారు. ఈ రాత్రికి ఆయన చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ నుంచి రేపు ఉదయం హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది ఘటనాస్థలానికి చేరుకుని అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. దీనికితోడు హిమాచల్ అధికారులతో విద్యార్థుల వెలికితీతపై అనురాగ్ శర్మ చర్చించనున్నారు.