: సబిత రాజీనామా చేయాలనుకుంటున్నారు: డి.కె.అరుణ
హోం మంత్రి సబిత రాజీనామా చేయాలని అనుకుంటున్నారని మరో మంత్రి డి.కె.అరుణ చెప్పారు. సబితను ఆమె నివాసంలో కలుసుకున్న తర్వాత మంత్రి అరుణ మీడియాతో మాట్లాడారు. రాజీనామా విషయంలో తొందరపడవద్దని సూచించానని చెప్పారు. సబిత నిబంధనలకు అనుగుణంగానే జీవోలకు ఆమోదం తెలిపారని అరుణ సమర్థించారు. మరోవైపు సబిత రాజీనామా యోచనను చాలా మంది మంత్రులు వ్యతిరేకిస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో సబితను నాలుగో నిందితురాలిగా సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చిన సంగతి తెలిసిందే.