: దీని వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం...శుభ్రానికి శుభ్రం


వినియోగదారులకు ఆరోగ్యంతో పాటు పరిశుభ్రతను అందించేందుకు 'ది వీల్' పేరిట అత్యాధునిక ట్రెడ్ మిల్ ను సి హెయాంగ్ ర్యూఓ రూపొందించారు. పట్టణాల్లో గ్రౌండ్ లు లేకుండా పోయాయి. కాంక్రీట్ జంగిల్ లో అపార్ట్ మెంట్ కల్చర్ పెరిగిపోయిన కారణంగా ఉదయాన్నే వ్యాయామం చేయాలంటే వేలకు వేలు పోసి జిమ్ లకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ దుస్థితికి చెక్ చెప్పేందుకు దక్షిణ కొరియాకు చెందిన ఉత్పత్తుల కంపెనీ ఓ చక్కటి ట్రెడ్ మిల్, వాషింగ్ మెషీన్ ను తయారు చేసి అందుబాటులోకి తెస్తోంది.

ఉదయాన్నే పరిగెత్తుతూ, దీనిపై వ్యాయామం చేస్తూ బట్టలు కూడా ఉతికేసుకోవచ్చు. ఇది గుండ్రంగా ఉంటుంది. ఇతర వాషింగ్ మిషిన్లలో నింపేలా బట్టలు, సరిపడా నీరు, వాషింగ్ పౌడర్ ను ట్రెడ్ మిల్ లోపలి భాగంలో ఉండే కనిస్టేర్స్ లో నింపి, దానిపై పరిగెడితే దానంతట అదే ఉతికేస్తుంది. ఈ సందర్భంగా విడుదలయ్యే అదనపు విద్యుత్ ను బ్యాటరీ నిక్షిప్తం చేస్తుంది. దీనికి విద్యుత్ అవసరం లేదు.

అలాగే అధిక నీటి వినియోగాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కేవలం మానవ శక్తే అవసరం, జాగింగ్ చేసే ఓపిక లేకుంటే గతంలో జాగింగ్ చేసినప్పుడు బ్యాటరీలో నిక్షిప్తమయ్యే విద్యుత్ ను ఈ వాషింగ్ మెషీన్ వినియోగించుకోవడం దీని ప్రత్యేకత. ఈ వీల్ లో జాగింగ్ చేసేప్పుడు మనిషి కనపడే విధంగా గాజు అద్దాలను నిపుణులు ఏర్పాటు చేశారు.

దీనిని 2014లో జరిగే ఎలక్టరోలక్స్ డిజైన్ ల్యాబ్ కాంపిటేషన్ కి పంపనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే నీటి కష్టాలతో పాటు విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News