: రాష్ట్రాభివృద్ధికి 24 గంటలూ కష్టపడతా: చంద్రబాబు
రాష్ట్రాభివృద్ధికి 24 గంటలూ కష్టపడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కొత్త రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయని... జీతాలివ్వడానికి కూడా డబ్బులు లేవని అన్నారు. ఇంతవరకు రాజధానిని ఎక్కడ నిర్మిస్తారో కూడా తెలియదని చెప్పారు. మోడీ సహకారంతో ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ రోజు ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.