: మనదేశ మ్యాప్ విషయంలో వికీలీక్స్ తప్పటడుగు


ఇప్పటి వరకూ చైనా, గూగుల్ భారత మ్యాప్ ను తప్పుగా చూపించడం జరిగింది. తాజాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పాకిస్థాన్ దేశంలో అంతర్భాగంగా చూపిస్తూ వికీలీక్స్ ఇటీవల ఒక ప్రపంచ పటాన్ని విడుదల చేసింది. ఇప్పటి వరకూ తాను బయటపెట్టిన రహస్య సమాచార కేబుళ్లను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరింత సౌకర్యవంతంగా వినియోగించుకునేందుకు వీలుగా వికీలీక్స్ తాజాగా ఇంటరాక్టివ్ గ్లోబల్ మ్యాప్ ను విడుదల చేసింది. అయితే 1975నాటి దేశ సరిహద్దుల ఆధారంగా ఈ మ్యాప్ ను రూపొందించామని వికీలీక్స్ తన వెబ్ సైట్లో పేర్కొంది.

వాస్తవానికి పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం. ఇది ప్రపంచ దేశాలు అంగీకరించిన విషయం. అపర మేథావి జూలియన్ అసాంజే ఆధ్వర్యంలో ఎన్నో సంచలన విషయాలను వెలుగులోకి తెస్తున్న వికీలీక్స్ బృందానికి కనీసం చరిత్ర, వాస్తవిక విషయాలపై ఆ మాత్రమైన అవగాహన లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

  • Loading...

More Telugu News