: జయలలిత ఆస్తులపై విచారణను నేడు తేల్చనున్న సుప్రీం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణను సుప్రీంకోర్టు నేడు తేల్చనుంది. ఈ కేసు విచారణ బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు 2003లో సుప్రీంకోర్టు బదలాయించింది. దీన్ని నిలిపివేయాలని జయలలిత సుప్రీంకోర్టును లోగడ కోరగా... నేటి వరకూ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి నేటితో గడువు ముగిసిపోయినందున తదుపరి విచారణను బెంగళూరు కోర్టు కొనసాగించాలా? వద్దా? అన్నది సుప్రీం కోర్టు నేడు తేల్చే అవకాశం ఉంది.