: ఆంధ్రప్రదేశ్ కి అంతర్జాతీయ విమానాశ్రయం కావాలి: అశోక్ గజపతిరాజు
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం కావాలని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన... విశాఖ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా చేయాలనే ప్రతిపాదన ఉందని అన్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ రక్షణ శాఖ పరిధిలో ఉందని, దాంతో ఇబ్బందులు ఉన్నాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం కావాలంటే మౌలిక వసతులు పెరగాలని ఆయన సూచించారు.