: 30 కోట్లు ఇవ్వకపోతే కాలేజీలు పేల్చేస్తాం: ఎంపీ మల్లారెడ్డికి బెదిరింపులు
మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ మల్లారెడ్డిని మావోయిస్టు పేరుతో ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి బెదిరించాడు. రూ. 30 కోట్లను తమ పార్టీకి విరాళంగా ఇవ్వాలని... లేకపోతే మల్లారెడ్డి గ్రూప్ కాలేజీలను పేల్చివేస్తామని హెచ్చరించాడు. ఈ బెదిరింపు కాల్స్ పదేపదే వస్తుండటంతో... బోయిన్ పల్లి పోలీసులకు మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. తాను ఎంపీగా గెలుపొందిన రోజు నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆ వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫోన్ చేసిన వ్యక్తి కేవలం కాయిన్ బాక్స్ లనే వినియోగించడం గమనార్హం.