: భూటాన్ లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
భారత ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటనకు గాను భూటాన్ వెళ్లారు. ప్రధానిగా మోడీ తొలి విదేశీ పర్యటన ఇది. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తాయి. ఇప్పటికే భూటాన్ లో భారత్ భారీగా పెట్టుబడులను పెట్టింది. అంతేకాకుండా, రూ. 4500 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది. టెక్నాలజీ, వ్యవసాయం తదితర రంగాలలో సహాయం చేయనుంది. విమానాశ్రయంలోనే మోడీకి సైనికవందనంతో భూటాన్ తమ గౌరవాన్ని చాటుకుంది. మోడీతో పాటు విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా ఉన్నారు.