: వారణాసిలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం


ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తుండగా 145 కిలోల అమ్మోనియం నైట్రేట్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా కారును చెక్ చేసినప్పుడు ఈ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు పరారవ్వగా, ఓ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు.

  • Loading...

More Telugu News