: మంత్రి పదవి రాలేదన్న బాధ లేదు: కాగిత వెంకట్రావు
మంత్రి పదవి రాలేదన్న బాధ ఏ కోశానా లేదని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తనకు ఆనందాన్ని కలిగించిందని ఆయన అన్నారు. ఛాతీ నొప్పితో మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన కాగిత వెంకట్రావు ఇవాళ డిశ్చార్చి అయ్యారు. అడగకుండానే తనకు చంద్రబాబు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి గెలిపించారని, ఆయనకు తాను రుణపడి ఉంటానని ఆయన చెప్పారు.