: హైదరాబాదులో ఎంఎంటీఎస్ ట్రైన్ నుంచి వ్యక్తి తోసివేత.. పరిస్థితి విషమం
హైదరాబాదులోని చిలకలగూడ వద్ద ఎంఎంటీస్ ట్రైన్ లో ఓ వ్యక్తిపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. అనంతరం అతనిని ట్రైన్ నుంచి తోసివేశారు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆ వ్యక్తి నుంచి డబ్బు కోసమే దుండగులు ఈ దాడి చేసినట్లు సమాచారం.