: ఇరాక్ కోరితే సాయం చేసేందుకు సిద్ధమే: ఇరాన్
సున్నీ ఉగ్రవాదుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఇరాక్ ప్రభుత్వం తమను కోరితే సాయం చేసేందుకు సిద్ధమేనని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాక్ లోని ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ లెవెంట్ అనే ఉగ్రవాద సంస్థ ఒక్కొక్క నగరాన్ని ఆక్రమించుకొంటూ వస్తోంది. ఇప్పటికే పెద్ద నగరాలైన మొసూల్, తిక్రిత్ లు వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. రాజధాని నగరమైన బాగ్దాద్ వైపుకు వస్తున్న వీరిని అడ్డుకునేందుకు ఇరాక్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.