: 25 పాటలతో స్టార్ హీరో సినిమా


సినిమాల్లో సాధారణంగా ఐదు లేక ఆరు పాటలుంటాయి. మరీ భక్తిరస ప్రధానమైన సినిమా అయితే పదో పన్నెండో పాటలుంటాయి. ఇందుకు భిన్నంగా, ఏకంగా 25 పాటలతో ఓ సినిమా రూపొందుతోంది. 'బర్ఫీ' సినిమాతో అలరించిన అనురాగ్ బసు, రణబీర్ కపూర్ జోడీ మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా పేరు 'జగ్గా జాసూస్'. ఇందులో మొత్తం 25 పాటలున్నాయి. ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తైంది.

ఇందులో రణబీర్ కపూర్ 18 ఏళ్ల డిటెక్టివ్ గా నటిస్తుండగా, అతని సవతి తండ్రిగా గోవిందా నటిస్తుండడం విశేషం. ఈ సినిమాలో 25 పాటలుంటాయని అనురాగ్ బసు తెలిపారు. ఈ సినిమాతో రణబీర్ కపూర్ నిర్మాతగా కూడా మారుతున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ కపుల్ కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ నటిస్తుండడం మరింత ఆకర్షణ.

  • Loading...

More Telugu News