: సచివాలయంలో 11 మంది ఏపీ మంత్రులకు ఛాంబర్స్ కేటాయింపు
11 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు ఛాంబర్స్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు సౌత్ హెచ్ బ్లాక్ లోని 301, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి జె బ్లాక్ లోని 201 గదిని కేటాయించారు. దేవినేని ఉమాకు జే బ్లాక్ లోని 801, అయ్యన్నపాత్రుడుకు సౌత్ హెచ్ బ్లాక్ లోని 217, అచ్చెన్నాయుడుకు జే బ్లాక్ లోని 501 గదిని కేటాయించారు. కొల్లు రవీంద్రకు జె బ్లాక్ లోని 805, చినరాజప్పకు సౌత్ హెచ్ బ్లాక్ లోని 201, పరిటాల సునీతకు జె బ్లాక్ లోని 704 గదిని కేటాయించారు. గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి, పీతల సుజాతకు కూడా ఛాంబర్స్ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.