: భారతీయ వైద్య దంపతుల నేరం రుజువు
ఆమోదం లేని మందులను రోగులకు సూచించినందుకు అమెరికాలో భారతీయ వైద్య దంపతులకు అక్కడి టెన్నెస్సీ కోర్టు ప్రొబేషన్ విధించింది. అనిధ్యకుమార్ సేన్(65), ఆయన భార్య పాట్రీసియా పోసే సేన్ (66) నకిలీ కేన్సర్ చికిత్సా మందులను మార్కెట్లోకి పరిచయం చేయడం ద్వారా అమెరికా ఆహార, ఔషధ చట్టాన్ని ఉల్లంఘించారని డిస్ట్రిక్ట్ జడ్జి రోనీ గ్రీర్ పేర్కొన్నారు. అనిధ్యకుమార్ కు మూడేళ్ల ప్రొబేషన్, లక్ష డాలర్ల జరిమానా... ఆయన భార్య పోసే సేన్ కు నాలుగేళ్ల ప్రొబేషన్, రెండు లక్షల డాలర్ల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. కీమోథెరపీకి సంబంధించి ఆమోదం లేని మందులను వీరు కొనుగోలు చేసి తమ క్లినిక్ లో వాడుతున్నట్లు దర్యాప్తు అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ ప్రొబేషన్ కాలంలో అనిథ్యకుమార్ సేన్ 100 గంటలు, ఆయన భార్య 200గంటలు సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది. ప్రొబేషన్ ముగిసే వరకూ వైద్య సేవలు చేయడానికి అనుమతించరు.