: జమ్మూ కాశ్మీర్ కు రక్షణ మంత్రి... భద్రతపై సమీక్ష
రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ జమ్మూ కాశ్మీర్ కు ఈ రోజు చేరుకున్నారు. ఆయన వెంట ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ కూడా ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జైట్లీ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ వోహ్రా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ కానున్నారు. అలాగే, సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులు, ఉగ్రవాదుల చొరబాట్లు, వాటి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై రక్షణ మంత్రికి సైనికాధికారులు తెలియజేయనున్నారు. ఈ పర్యటనలోనే జైట్లీ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ఆర్మీ అధికారులతో ముఖాముఖి సమావేశం అవుతారు.