: రాజహంసలాంటి అతి ఖరీదైన నౌక ‘ఆజం’
హైలో హైలేసా హంస కదా నా పడవ
ఉయ్యాల లూగినదీ.. ఊగీస లాడినదీ...
నదిలో నా రూపు నవనవలాడినది
మెరిసే అందములూ మిలమిల లాడినవి...
భీష్మ చిత్రంలో ఈ సూపర్‌హిట్ సాంగ్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అచ్చంగా ఈ వర్ణన సరిపోయేలా.. మెరిసే సముద్ర జలాలలో మిలమిలలాడే అద్భుతమైన అందాలతో, హంగులతో అలరారే.. రాజహంస లాంటి పడవపేరు ఆజం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నౌకగా దీనిని రూపొందిస్తున్నారు. దీని తయారీని జర్మనీ నౌకానిర్మాణకేంద్రం ప్రారంభించింది. ఇది 590 అడుగుల పొడవుతో రెండు ఫుట్‌బాల్ మైదానాల దూరం, 67అడుగుల కంటె ఎక్కువ ఎత్తు ఉంటుంది. రెండు గ్యాస్ టర్బయిన్లు, రెండు డీజిల్ ఇంజిన్లు ఉండే ఆజం 94 వేల హార్స్ పవర్‌తో గంటకు 55 కి.మీ. వెళ్తుంది. నడపడానికి సుమారు 50 మంది కావాలి. ఈ ఆజం నౌక యజమాని వివరాలు ఇంకా బయటకు పొక్కలేదు. బహుశా సౌదీరాజులు అయిఉండవచ్చునని అనుకుంటున్నారు. ఇంతకూ దీని ధర చెప్పలేదు కదూ.. మరేం గాభరా అక్కర్లేదు. కేవలం 3300 కోట్లు మాత్రమే.