: విద్యార్థుల కోసం స్వయంగా గాలిస్తున్న తల్లిదండ్రులు


హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు లార్జి డ్యాం నుంచి నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేశారు. 800 మంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. 30 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ నడుస్తోంది. వీరిలో ఆర్మీ, ఎస్ఎస్పీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఉన్నాయి. నదిలో నీటి ప్రవాహం ఆగిపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకోసం గాలింపు చేపట్టారు. వీరికి తోడు, హిమాచల్ మంత్రి అనిత్ శర్మ, తెలంగాణ హోంమంత్రి నాయిని, ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డిలు అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News