: ఏపీ ప్రభుత్వానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సూచనలు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కొన్ని సూచనలు చేశారు. తమ ప్రభుత్వ (కాంగ్రెస్) పథకాల్లోని లోటుపాట్లను సవరించి కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజనం, ఆదర్శ రైతులు, రేషన్ డీలర్లను తొలగించవద్దని కోరారు. ఇక కమిటీల పేరుతో జాప్యం చేయవద్దని సూచించారు. తమ పాలనలో తప్పుచేసిన వారిపై చట్టబద్ధ సంస్థతో విచారణ చేయించవచ్చని రఘువీరా పేర్కొన్నారు. ఇంకా పలు విషయాలపై ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచనలు చేశారు.