: మా ఖర్చులతోనే బ్రెజిల్ వెళ్తాం: గోవా ఎమ్మెల్యేలు
సాకర్ వరల్డ్ కప్ పోటీలను వీక్షించేందుకు తమ సొంత ఖర్చులతోనే బ్రెజిల్ వెళ్తామని గోవా ఎమ్మెల్యేలు వెల్లడించారు. గోవా ప్రభుత్వం ఆరుగురు ఎమ్మెల్యేలను బ్రెజిల్ పంపిస్తున్న విషయంలో వివాదం నెలకొనడంతో ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. బ్రెజిల్ ప్రపంచ కప్ పోటీల అధ్యయనం కోసం ఆరుగురు ఎమ్మెల్యేలను బ్రెజిల్ పంపడానికి గోవా ప్రభుత్వం రూ.89 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఎమ్మెల్యేలు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బ్రెజిల్ వెళుతున్న ఆరుగురు ఎమ్మెల్యేలలో ఒకరైన అవెర్టానో పుటాడో ఈ విషయంపై స్పందిస్తూ... తమ సొంత ఖర్చులతోనే బ్రెజిల్ వెళ్తామని, ప్రభుత్వం సొమ్మును వినియోగించబోమని స్పష్టం చేశారు.