: అందులో తప్పేముంది?: గోవా సీఎం
ప్రభుత్వ వ్యయంతో మంత్రులు, ఎమ్మెల్యేలను ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు బ్రెజిల్ కు పంపాలని తీసుకున్న నిర్ణయాన్ని గోవా సీఎం మనోహర్ పారికర్ సమర్థించుకున్నారు. దీన్ని ఖర్చు కింద కాకుండా పెట్టుబడిలా చూస్తున్నామని చెప్పారు. ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రజాధనంతో బ్రెజిల్ కు పంపనుండడంపై గోవా కాంగ్రెస్ నేతలు మోడీకి లేఖ రాసిన నేపథ్యంలో పారికర్ స్పందించారు. ఇందులో తప్పేం లేదన్నారు. తమ రాష్ట్ర క్రీడగా ఫుట్ బాల్ ను ప్రకటించామని, ఆ ఆటను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను, కావాల్సిన వసతులను పరిశీలించేందుకు మంత్రుల పర్యటన తోడ్పడుతుందని చెప్పారు.