: గుంటూరు జిల్లాలో అగ్నిప్రమాదం... 40 పూరిళ్లు దగ్ధం
గుంటూరు జిల్లాలోని తెనాలిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాండురంగపేటలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పరిసరాలకు వ్యాపించడంతో 40 పూరిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్తినష్టం ఎంత అనేది ఇంకా తెలియరాలేదు.