: కనకపు సింహాసనంపై సన్నీలియోన్ ను కూర్చోబెడితే!


సన్నీ లియోన్... ఈ పేరు చెబితే శృంగార పాత్రలే గుర్తుకొస్తాయి ఎవరికైనా! కానీ, ఆ పేరును మార్చి... సన్నీ అంటే ఓ మంచి నటి అనిపించుకునే దిశగా సన్నీలియోన్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సన్నీ తన తదుపరి చిత్రం 'లీల'లో యువరాణి పాత్రను పండించబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే, యువరాణి అంటే ఒంటి నిండా అందమైన వస్త్రధారణతో ఉన్న రూపమే మదిలో మెదులుతుంది. కానీ అందుకు భిన్నంగా, సన్నీ తన పూర్వాశ్రమంలోని పాత్రలకు తగ్గట్లుగానే హాట్ హాట్ గా రెండు పీసుల వస్త్రాలతో రాజసింహాసనంపై కూర్చుని కనిపిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి బాబీ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News