: 550 మందితో బియాస్ నదిలో కొనసాగుతున్న గాలింపు
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన తెలుగు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 550 మంది సహాయ సిబ్బంది గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి దాకా 8 మృతదేహాలను వెలికి తీశారు. మరో 16 మంది కోసం గాలింపును ముమ్మరం చేశారు. దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలో గాలిస్తున్నారు.