: బిజీ షెడ్యూల్ వల్లే మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లలేదు: అమితాబ్
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో మే 26న జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి బిజీ షెడ్యూల్ వల్లే హాజరుకాలేక పోయానంటున్నారు సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన బిగ్ బీ, ఉన్న కమిట్స్ మెంట్స్ లో లేట్ అవర్స్ కూడా పని చేయడంవల్ల ఆ ఫంక్షన్ కు వెళ్లలేకపోయానని వివరించారు. అయితే, అప్పుడే మోడీకి అమితాబ్ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల నుంచి అమితాబ్ గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తున్నారు.