: నాలుగో అంశంగా పెన్షన్లపై చర్చించాం: చంద్రబాబు
మంత్రివర్గ సమావేశంలో నాలుగో అంశంగా పెన్షన్లపై చర్చించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. వృద్ధులు, వికలాంగుల ఫించన్లను సెప్టెంబరు నెల నుంచి ఇస్తామని, వీటిని అక్టోబరు 2వ తేదీ నుంచి చెల్లిస్తామనీ అన్నారు. వీరి పెన్షన్లను రూ.1000 లకు పెంచినట్లు ఆయన చెప్పారు. తెలంగాణ నుంచి ఆంద్రప్రదేశ్ కు వచ్చే ఉద్యోగులకు కూడా 60 ఏళ్ల పదవీ విరమణ వయస్సు వర్తిస్తుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 15,900 కోట్ల లోటుతో రాష్ట్రం ఉన్నట్లు అంచనా వేసినట్లు చంద్రబాబు చెప్పారు.