: జగన్ కేసులో ఏ4గా సబితా ఇంద్రారెడ్డి


కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ ఈ మధ్యాహ్నం ఐదవ ఛార్జీషీటు దాఖలు చేసింది. ఈ కేసులో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపైనా సీబీఐ అధికారులు ఛార్జీషీటు దాఖలు చేశారు. సబితను ఏ4గా పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, రాజగోపాల్ పైనా పలు అభియోగాలు నమోదు చేసింది. ఈ ఛార్జిషీటులో మొత్తం 13 మందిపై అభియోగాలు నమోదు చేశారు. ఎ1గా జగన్, ఎ2గా విజయసాయి, ఎ3గా దాల్మియాలను పేర్కొన్నారు. శ్రీలక్ష్మిని ఎ5గా, గనుల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్ ను ఎ6గా సీబీఐ పేర్కొంది. కాగా, సాక్షులుగా 46 మందిని ఈ కేసులో చేర్చింది. భారతి సిమెంట్స్ లో దాల్మియా పెట్టుబడులు రూ. 95 కోట్లు ముడుపులేనని సీబీఐ తేల్చింది.

  • Loading...

More Telugu News