: దేశ రాజధానిలో కారులో తిప్పుతూ అత్యాచారం
దేశ రాజధాని ఢిల్లీ నడివీధుల్లో తిప్పుతూ కారులోనే ఓ బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేశారు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరగ్గా వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారు ముగ్గురూ నాంగాల్ దేవత్ ప్రాంతానికి చెందిన జితేందర్, జై భగవాన్, అజయ్ గా పోలీసులు తెలిపారు.