: ఘనంగా నటి అమలాపాల్, దర్శకుడు విజయ్ ల వివాహం
కథానాయిక అమలాపాల్, దర్శకుడు ఏఎల్ విజయ్ ల వివాహం ఈ ఉదయం చెన్నైలోని వల్లియమ్మాయ్ హాల్ ఎంఆర్ సి సెంటర్లో ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం అమల మెడలో విజయ్ మూడుముళ్లు వేశాడు. చిల్లీ కలర్ కంజీవరపు పట్టుచీరలో అమల తళుక్కుమనగా, తమిళ సంప్రదాయం ప్రకారం విజయ్ పంచెకట్టులో మెరిశాడు. ఈ వివాహానికి పలువురు తమిళ సినీ సెలబ్రిటీలు, స్నేహితులు హాజరయ్యారు.
తమిళంలో విజయ్ దర్శకత్వం వహించిన 'దైవ తిరుమగళ్' (తెలుగులో 'నాన్న') చిత్రంలో అమలా నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు వచ్చాయి. తర్వాత వారు మరింత దగ్గరవడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.