: సికింద్రాబాద్-కాకినాడల మధ్య జన సాధారణ్ ప్రత్యేక రైళ్లు


వేసవి రద్దీని తట్టుకునేందుకు సికింద్రాబాద్-కాకినాడ మధ్య జన సాధారణ్ ప్రత్యేక రైలును నడుపుతున్నారు.

నెంబరు 07105 జన సాధారణ్ ప్రత్యేక రైలు జూన్ 13వ తేదీ రాత్రి 10.40 గంటలకు సికింద్రాబాదు నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 11 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. నెంబరు 07106 జన సాధారణ్ ప్రత్యేక రైలు జూన్ 15వ తేదీ రాత్రి 7.15 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 9.45 గంటలకు సికింద్రాబాదు స్టేషనుకు చేరుకుంటుంది. ఇది సామర్లకోట, రాజమండ్రి నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది.

  • Loading...

More Telugu News