: ఫేస్ బుక్ లో ఫొటో పట్టించింది


నేరస్థులను పట్టుకోవడానికి దర్యాప్తు అధికారులకు ఫేస్ బుక్ ఇటీవలి కాలంలో చాలా ఉపయోగపడుతోంది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన నిందితుడు ఓ హత్య కేసులో ఇలానే దొరికిపోయాడు. మే 9న పదో తరగతి విద్యార్థి హత్య జరిగింది. ఈ కేసులో నిందితుడైన సచిన్ ఇటీవల ఫేస్ బుక్ లో ఓ ఫొటో పెట్టాడు. అందులో అతడు కూర్చున్న టేబుల్ పై ఓ తుపాకీ కూడా ఉంది. దీన్ని హత్యకు గురైన విద్యార్థి కుటుంబ సభ్యులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు నిందితుడు సచిన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

  • Loading...

More Telugu News