: బ్యాంకులను మోసగించిన ప్రకాశం జిల్లా కోల్డ్ స్టోరేజి యాజమాన్యం


ప్రకాశం జిల్లా బోడవాడ కోల్డ్ స్టోరేజి యాజమాన్యం రుణాల పేరుతో బ్యాంకులను మోసగించింది. స్టోరేజ్ లో నిల్వలు ఉన్నాయని చెప్పి కోట్ల రూపాయల రుణం తీసుకున్నారంటూ ఎస్ బీఐ, సిండికేట్ బ్యాంకు అధికారులు పర్చూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.1.44 కోట్ల మేర మోసం చేసినట్లు సిండికేట్ బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక గతంలో రూ.12.50 కోట్ల రుణం తీసుకున్నట్లు ఎస్ బీఐ ఫిర్యాదు చేసింది. అటు అడుసుమిల్లి గోదాముల్లో నిల్వలు తరలించి రూ.3.40 కోట్ల మేర మోసం చేశారని చెప్పారు.

  • Loading...

More Telugu News