: టీ.డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పద్మా దేవేందర్ రెడ్డి
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి, టీడీపీ సభాపక్ష నేత ఎర్రబెల్లి తదితరులు అభినందించారు. అందరూ కలసి ఆమెను వెంటబెట్టుకుని వెళ్లి స్పీకర్ ఛైర్ లో కూర్చోబెట్టారు. ప్రస్తుతం టీ.అసెంబ్లీలో పద్మా దేవేందర్ రెడ్డిని అభినందించే ప్రసంగాలు కొనసాగుతున్నాయి.