: నేటి నుంచే ఫుట్ బాల్ వరల్డ్ కప్... సాకర్ ఫీవర్లో ప్రపంచం
ప్రపంచంలో అత్యంత ఆదరాభిమానాలు గల క్రీడ ఫుట్ బాల్. క్షణక్షణం తీవ్ర ఉత్కంఠతో సాగిపోయే సాకర్ సగటు క్రీడాభిమాని హార్ట్ బీట్ ను అమాంతం పెంచేస్తుంది. గోల్ అయినా గోలే... కాకపోయినా గోలే... అంతా గోలగోలే. ఇప్పుడు ప్రపంచాన్నంతా సాకర్ ఫీవర్ ఊపేస్తోంది. కారణం... 20వ సాకర్ వరల్డ్ కప్. సాకర్ ని ప్రాణంగా భావించే బ్రెజిల్ లో నేటి నుంచే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ఆరంభ వేడుకలు మొదలవుతాయి. రాత్రి 1.30 గంటలకు బ్రెజిల్, క్రొయేషియా మ్యాచ్ తో వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. 32 జట్లు... ఎనిమిది గ్రూపులు... 12 వేదికలు... 32 రోజులు... క్లుప్తంగా చెప్పాలంటే, ఇదీ ఈ సాకర్ సంరంభం. సోనీ సిక్స్ ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.