: నేడు విశాఖలో ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గ సమావేశం
నూతన ఆంధ్రప్రదేశ్ తొలి మంత్రివర్గ సమావేశం ఈ రోజు విశాఖపట్నం, ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశ మందిరంలో 11:30 గంటలకు జరగనుంది. జూన్ 8 న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం సందర్భంగా చేసిన అయిదు నిర్ణయాలపై ఈ సమావేశంలో ఆమోదముద్ర వేసే అవకాశముంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రత్యేక చర్చ జరగొచ్చని తెలుస్తోంది. మంత్రివర్గ తొలి సమావేశం కావడంతో మంత్రివర్గ సహచరులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తారు. చంద్రబాబు ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని అక్కడినుంచి నేరుగా సింహాచలం వెళ్లి వరాహలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని మంత్రివర్గ సమావేశానికి వస్తారు.