: అధికారులతో సమావేశమైన బాలకృష్ణ


టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో వివిధ శాఖల అధికారులతో భేటీ అయ్యారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి వారితో చర్చిస్తున్నారు. మంచి నీటి సదుపాయంపై ఆయన ప్రాథమికంగా దృష్టి సారించారు. హిందూపురంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని... వాటి పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని బాలకృష్ణ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News