: ఆపరేషన్ కు ముందూ సంగీతం.. ఆపరేషన్ తర్వాతా సంగీతం!


మనిషి మనసును రంజింపజేయడంలో సంగీతానిది ప్రత్యేక స్థానం. అసలు సంగీతానికి పరవశించని వారెవరుంటారు!? జంతువులు కూడా స్వర బద్ధమైన నాదానికి స్పందిస్తాయంటారు. ప్రతి భావానికి ఓ స్వరం.. నిర్ధిష్టమైన తాళం.. వెరసి సంగీతం అవుతుంది. మనుషుల మూడ్ మార్చడంలో ఈ ప్రాపంచిక భాషది అందె వేసిన చేయి. విచారం, విషాదం, సంతోషం, దు:ఖం, భయం, రౌద్రం, బీభత్సం ఇలా ప్రతి రసానికి సాధికారిక ప్రతినిధుల్లాంటి రాగాలు సంగీతంలో కనిపిస్తాయి, సదా వినిపిస్తాయి.

ఇటీవల కాలంలో వ్యాధులు నయం చేయడంలో సంగీతాన్ని ఉపయోగిస్తూ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. తాజాగా మరో అడుగు ముందుకేసి రోగులకు శస్త్రచికిత్సల వేళ కూడా సంగీతం వినిపించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు కెంటకీ యూనివర్శిటీ పరిశోధకులు. వారు చేపట్టిన అధ్యయనంలో శస్త్రచికిత్సకు ముందు, శస్త్రచికిత్స వేళ, శస్త్రచికిత్స తరువాత సంగీతం వినిపించి సానుకూల ఫలితాలు రాబట్టారు.

శ్రావ్యమైన సంగీతాన్ని మంద్రస్థాయిలో వినిపించడంతో రోగులకు ఆపరేషన్ల సందర్భంగా కలిగే నొప్పి పెద్దగా బాధించలేకపోయిందట. ఆపరేషన్ కు ముందు రోగిలో కలిగే భయాందోళనలు దూరం చేసి, వారిని శస్త్రచికిత్సకు సన్నద్ధం చేయడంలో సంగీతం పాత్ర ప్రశంసనీయమని సదరు పరిశోధకులంటున్నారు.

  • Loading...

More Telugu News