: గవర్నర్ ఉపన్యాసం కేసీఆర్ ఎన్నికల ప్రసంగంలా ఉంది: ఎర్రబెల్లి
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ఉపన్యాసం కేసీఆర్ ఎన్నికల ప్రసంగంలా ఉందని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని ఎర్రబెల్లి చెప్పారు.