: అన్ని రకాల పంట రుణాలు మాఫీ చేయాలి: రెడ్యా నాయక్
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత రెడ్యా నాయక్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... రుణ మాఫీపై రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారని అన్నారు. రూ. 50 వేల కోట్ల రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఆయన కోరారు.