: సోనియాపై పిటిషన్ కొట్టేసిన అమెరికా కోర్టు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను అమెరికా కోర్టు ఒకటి కొట్టివేసింది. పిటిషనర్ ఆరోపణలను నిరూపించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. అదే సమయంలో భవిష్యత్తులో ఇదే విషయమై మళ్లీ పిటిషన్ దాఖలు చేయకుండా నిషేధం విధించడానికి కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ ను సిఖ్ ఫర్ జస్టిస్ అనే సంస్థ దాఖలు చేసింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషులైన కాంగ్రెస్ నేతలను సోనియా రక్షించే ప్రయత్నం చేశారని ఈ సంస్థ ఆరోపించింది.