: అక్కడ చెత్త వేస్తే రూ.10 వేల జరిమానా లేదా మూడు రోజుల జైలు శిక్ష
గంగానది ప్రక్షాళనకు మోడీ ప్రభుత్వం నడుం బిగించింది. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కేంద్రం రూపొందించే పనిలో ఉంది. గంగానదిలో ఎవరైనా ఉమ్మేసినా లేదా చెత్త, పాలిథీన్ కవర్లు వేసినా వారికి మూడు రోజుల జైలు శిక్ష లేదా రూ. 10 వేల జరిమానా విధించే యోచనలో మోడీ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. గంగా జలం శుద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాఖ బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి ఉమాభారతి పవిత్ర గంగానది జలాన్ని శుద్ధి చేస్తామని, ప్రాచీన కాలంలో గంగ ఎంత శుద్ధంగా ఉండేదో తిరిగి అంత స్వచ్ఛంగా ఉండేలా చర్యలు చేపడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.