: అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం


అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా ఉత్తర-వాయవ్య దిశగా పయనించి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం ముంబయికి నైరుతి దిశలో సుమారు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో పశ్చిమ తీర ప్రాంతంలోని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మన రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రాయలసీమలో కొన్ని చోట్ల, కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News