: మండి జిల్లా కలెక్టరుతో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం
హిమాచల్ ప్రదేశ్, మండి జిల్లా కలెక్టరుతో బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ, తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయిని నర్శింహారెడ్డిలు కూడా పాల్గొన్నారు. ఆధునిక పరికరాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిపుణులతో సంప్రదించి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రమాదంలో నదిలో కొట్టుకుపోయిన వారిలో ఇప్పటివరకూ ఆరుగురి మృతదేహాలు మాత్రమే లభ్యమైన సంగతి తెలిసిందే.